మెదక్ జిల్లాలోని మత్స్యకారులకు ఉపాధి కల్పించేందుకు వందశాతం రాయితీపై అందిస్తున్న చేప పిల్లలు నేటికీ పూర్తి స్థాయిలో చెరువులకు చేరలేదు. ప్రభుత్వం కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంతో ఈ ఏడాది వార
సీజన్ సగం దాటినా ఉచిత చేప పిల్లల పంపిణీ ప్రక్రియలో పురోగతి కన్పించడం లేదు. చెరువులకు చేప పిల్లలు చేరే అంశంపై ఇప్పటికి సందేహాలే కన్పిస్తున్నాయి. గత కేసీఆర్ ప్రభుత్వంలో మత్స్యరంగానికి పెద్దపీట ఉండేది.
కాంగ్రెస్ సర్కారు నీలి విప్లవంపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో మత్స్యకారుల్లో ఆందోళన నెలకొంది. మెదక్ జిల్లాలోని 21 మండలాల్లో మొత్తం 1411 చెరువులు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 280 మత్స్యకార సంఘాలు ఉన్నాయి.