తెలంగాణ ఫస్ట్ సీఎం కేసీఆర్ తమకే కాదు, అమరుల కుటుంబాలన్నింటికీ పెద్దదిక్కుగా నిలిచారని అమరుడు కానిస్టేబుల్ పుట్టకొక్కుల కిష్టయ్య కూతురు డాక్టర్ ప్రియాంక గుర్తు చేస్తున్నారు.
తెలంగాణొచ్చింది.. తెల్లగోలుగా బతుకుతున్న. నేనొక్కన్నే కాదు.. నాతో పాటు రాష్ట్రంలున్న 23 వేల మంది కరెంటు కార్మికులు తెలంగాణొచ్చినంక తెల్లగోలుగ బతుకుతున్నరు. తెలంగాణ రాకముందు సిమ్మసీకట్ల మగ్గిన మా జీవితాల�