Nizamabad Job News | తాత్కాలిక పద్ధతిన ఉద్యోగాలు.. రేపు ఆఖరు తేదీ
జిల్లా వైద్యారోగ్యశాఖ కార్యాలయంలో తాత్కాలిక పద్ధతిన ఉద్యోగులను తీసుకుంటున్నట్లు జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి డాక్టర్ బాలనరేంద్ర ఒక ప్రకటనలో తెలిపారు.

ఖలీల్‌వాడి: జిల్లా వైద్యారోగ్యశాఖ కార్యాలయంలో తాత్కాలిక పద్ధతిన ఉద్యోగులను తీసుకుంటున్నట్లు జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి డాక్టర్ బాలనరేంద్ర ఒక ప్రకటనలో తెలిపారు. ఔట్ సోర్సింగ్ విధానంలో పనిచేయడానికి పలు విభాగాల్లో ఖాళీలు ఉన్నాయని పేర్కొన్నారు. ఎంబీబీఎస్ 25, ల్యాబ్ టెక్నిషియన్లు 02, ఫార్మాసిస్టు 05, ఏఎన్ఎం 67 విద్యార్హత కలిగిన అభ్యర్థులకు రేపు 2వ తేదీన ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు డీఎంహెచ్‌వో కార్యాలయంలో ఇంటర్వ్యూ నిర్వహిస్తామని వెల్లడించారు. అర్హత గల అభ్యర్థులు అన్ని ఒరిజినల్ విద్యార్హత సర్టిఫికెట్లతో పాటు మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్, కుల ధ్రువీకరణ పత్రం, రెండు పాస్‌పోర్టు సైజు ఫొటోలు, ఒక సెట్ జిరాక్స్‌తో హాజరు కావాలన్నారు. ఇతర వివరాలకు nizamabad.telangana.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.
Read Today's Latest Nizamabad Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ

