టెక్ దిగ్గజ సంస్థ సిస్కో ఈ ఏడాది రెండో విడత లేఆఫ్‌లు ప్రకటించింది. సిబ్బందిలోని 7 శాతం అనగా, 5,600 మందిని తొలగించాలని నిర్ణయించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈ కంపెనీ 4 వేల మందికి పైగా ఉద్యోగులను తీసేసింది.
టెక్ దిగ్గజాల్లో లేఆఫ్స్ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. ఆర్ధిక మాంద్యం భయాలతో పాటు ఆర్ధిక మందగమనం వణికిస్తుండటంతో పలు టెక్ కంపెనీలు కొలువుల కోతకు తెగబడుతున్నాయి.