అమెజాన్ బాటలో మరో టెక్ దిగ్గజం : 700 మంది ఉద్యోగులపై సిస్కో వేటు
టెక్ దిగ్గజాల్లో లేఆఫ్స్ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. ఆర్ధిక మాంద్యం భయాలతో పాటు ఆర్ధిక మందగమనం వణికిస్తుండటంతో పలు టెక్ కంపెనీలు కొలువుల కోతకు తెగబడుతున్నాయి.
న్యూఢిల్లీ : టెక్ దిగ్గజాల్లో లేఆఫ్స్ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. ఆర్ధిక మాంద్యం భయాలతో పాటు ఆర్ధిక మందగమనం వణికిస్తుండటంతో పలు టెక్ కంపెనీలు కొలువుల కోతకు తెగబడుతున్నాయి. ఈ-కామర్స్ దిగ్గజం లేఆఫ్స్‌లో భాగంగా 18,000 మంది ఉద్యోగులను సాగనంపనుండగా మరో టెక్ కంపెనీ సిస్కో ఏకంగా 700 మంది ఉద్యోగులపై వేటు వేసింది.
సాఫ్ట్వేర్, హార్డ్‌వేర్ ఇంజనీరింగ్, ప్రోగ్రాం మేనేజ్మెంట్, ప్రోడక్ట్ డిజైన్, మార్కెటింగ్ సహా పలు విభాగాల్లో ఉద్యోగులను తొలగించినట్టు ఎస్‌ఎఫ్‌గేట్ వెల్లడించింది. బాధిత ఉద్యోగుల్లో 371 మంది కాలిఫోర్నియా, శాంజోస్‌లో పనిచేస్తున్నవారని వెల్లడైంది. వీరిలో ఇద్దరు సిస్కో వైస్ ప్రెసిడెంట్లు ఉన్నారని ఆ రిపోర్ట్ తెలిపింది. మిల్పిటాస్లో ఇంజనీర్లు టెక్నికల్ ఉద్యోగులుగా పనిచేసే 22 మంది ఉద్యోగులను కూడా విధుల నుంచి సిస్కో తప్పించింది.
కంపెనీ శాన్ఫ్రాన్సిస్కో కార్యాలయానికి చెందిన 80 ఉద్యోగులను కూడా సిస్కో యాజమాన్యం సాగనంపింది. ఆర్ధిక మందగమనం, వ్యయాల పెరుగుదలతో ఖర్చులకు కళ్లెం వేయాలనే ఉద్దేశంతో సిస్కో కొలువుల కోతకు పాల్పడిందని సమాచారం. ఇక కొన్ని వ్యాపారాల సుస్ధిర వృద్ది కోసమే కొందరు ఉద్యోగులను తొలగించాల్సి వచ్చిందని కంపెనీ సీఈఓ చక్ రాబిన్స్ పేర్కొన్నారు.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

