న్యూఢిల్లీ, సెప్టెంబర్ 19: టెక్ దిగ్గజ సంస్థ సిస్కో ఈ ఏడాది రెండో విడత లేఆఫ్‌లు ప్రకటించింది. సిబ్బందిలోని 7 శాతం అనగా, 5,600 మందిని తొలగించాలని నిర్ణయించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈ కంపెనీ 4 వేల మందికి పైగా ఉద్యోగులను తీసేసింది. తాజా లేఆఫ్‌లలో ఏయే శాఖల ఉద్యోగులను ఇంటికి పంపుతారన్న విషయంపై స్పష్టత లేదు. కంపెనీ వర్గాలు తప్పుడు సమాచారం ప్రచారం చేయడం పట్ల ఉద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.