తెలంగాణ సర్కారు తెచ్చిన ముఖ్యమంత్రి అల్పాహార పథకం నిరుపేద పిల్లల ఆరోగ్యానికి వరంలా మారుతున్నది. సర్కారు స్కూళ్లలో ప్రతిరోజూ తీరొక్క టిఫిన్ పెడుతుండడంతో విద్యార్థులు నిశ్చింతగా చదువుకుంటున్నారు.
పౌష్టికాహార లోపంతో బాధపడే చిన్నారులపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. భావి పౌరులుగా ఎదగాల్సిన పిల్లలు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలనే ఉద్దేశంతో అంగన్వాడీ కేంద్రాల ద్వారా సంక్షేమ పథకాలను అమల�