Rtc bus | సికింద్రాబాద్ నుంచి చర్లపల్లి రైల్వే టెర్మినల్(Cherlapalli Railway Terminal) వరకు ప్రతి 10 నిమిషాలకు ఒక ఆర్టీసీ బస్సు(Rtc bus) నడుపుతున్నట్లు ఆర్టీసీ చెంగిచెర్ల డిపో మేనేజర్ కే కవిత తెలిపారు.
చర్లపల్లి రైల్వే టర్మినల్‌ను ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం జాతికి అంకితం చేశారు. అత్యాధునిక సౌకర్యాలతో రూ.413 కోట్లతో నిర్మించిన ఈ టర్మినల్‌ను వర్చువల్‌గా ప్రారంభించారు.