భారీ వర్షంతో జూలూరుపాడు మండలంలోని వాగులు వంకలు పొంగిపొర్లాయి. మండలంలోని రాంపురం - ఏలకలొడ్డు గ్రామాల పరిధిలోని పశువులు, మేకలు, గొర్రెలను మేత కోసం వాటి కాపరులు శనివారం ఉదయాన్నే అడవికి తోలుకొని వెళ్లారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలోని దంతెలబోర గ్రామం వద్ద కిన్నెరసాని, ముర్రేడు వాగులు కలిసే చోట ఏడుగురు పశువుల కాపరులు బుధవారం వరద నీటిలో చిక్కుకున్నారు.