బజార్హత్నూర్: పశుపోషకులు, పశుకాపరులు జాగ్రత్తలు ( Precautions ) వహిస్తూ పశువులను కాపాడుకోవాలని జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ బి కిషన్ ( Doctor Kisan ) సూచించారు. శుక్రవారం మండలంలోని బర్కపల్లి గ్రామంలో (హైడ్రోజన్ సనైడ్) జొన్న ల్యాప తిని 16 ఆవులు మృతిచెందగా 30 ఆవులకు చికిత్స అందజేసి బతికించారు. ఈ సందర్భంగా శనివారం గ్రామాన్ని సందర్శించి పశు యజమానులకు పలు సూచనలు చేశారు. జొన్న పంట తీసిన వెంటనే భూమి నుంచి పూర్తిగా తొలగించకపోతే జొన్న ల్యాప చిగురించి పశువులు తినే ప్రమాదం ఉందని తెలిపారు. ఆయన వెంట మండల పశు వైద్య అధికారి డాక్టర్ పర్వేజ్ హైమద్ , రైతులు ఉన్నారు.