ప్రైమ్ వాలీబాల్ లీగ్ మూడో సీజన్లో హైదరబాద్ రెండో పరాజయం ఖాతాలో వేసుకుంది. చెన్నై వేదికగా జరిగిన పోరులో హైదరాబాద్ 15-17, 13-15, 11-15తో అహ్మదాబాద్ డిఫెండర్స్ చేతిలో పరాజయం పాలైంది.
వాలీబాల్ ఆటలో హైదరాబాద్కు ఘనమైన వారసత్వముందని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఇక్కడి నుంచి అద్భుత ప్రతిభ కల్గిన ప్లేయర్లు దేశానికి ప్రాతినిధ్యం వహించారని పేర్కొన్నారు.