హైదరాబాద్, ఆట ప్రతినిధి: ప్రైమ్ వాలీబాల్ లీగ్(పీవీఎల్)లో హైదరాబాద్ బ్లాక్‌హాక్స్ గెలుపు జోరు కొనసాగుతున్నది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ 3-2(8-15, 15-13, 9-15, 12-15, 8-15) తేడాతో కోల్‌కతా థండర్‌బోల్ట్స్‌పై అద్భుత విజయం సాధించింది. తొలి సెట్‌ను కోల్పోయినా..ఆ తర్వాత అద్భుతంగా పుంజుకున్న బ్లాక్‌హాక్స్ ప్రత్యర్థికి దీటైన పోటీనిచ్చింది. దీంతో ఐదు మ్యాచ్‌ల్లో మూడు విజయాలతో ఏడు పాయింట్లతో హైదరాబాద్ టాప్‌లోకి దూసుకొచ్చింది. గురు ప్రశాంత్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది.