హైదరాబాద్: ప్రైమ్ వాలీబాల్ లీగ్ (పీవీఎల్)లో హైదరాబాద్ బ్లాక్ హాక్స్‌కు పరాభవం ఎదురైంది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ 0-5 (14-15, 10-15, 14-15, 14-15, 9-15) కాలికట్ హీరోస్ చేతిలో చిత్తుగా ఓడింది. ఒక్క సెట్‌ను కూడా దక్కించుకోని బ్లాక్ హాక్స్ మూడో ఓటమిని నమోదు చేసుకుంది. మొదటి, మూడు, నాలుగో సెట్లలో తీవ్రంగా ప్రతిఘటించినా కూడా విజయం దక్కలేదు. ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో మూడింట ఓడి.. మరో మూడింటిలో గెలిచిన హైదరాబాద్ 7 పాయింట్లతో పట్టికలో ప్రస్తుతం మూడో స్థానంలో ఉంది. అయితే ఓడిన కూడా హైదరాబాద్ సెమీస్ అవకాశాలను ఇంకా మెరుగ్గానే ఉన్నాయి. కాలికట్ హీరో డేవిడ్ లీ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు. పాయింట్ల పట్టికలో టాప్‌లో ఉన్న అహ్మదాబాద్ డిఫెండర్స్.. అట్టడుగున ఉన్న కొచ్చి బ్లూ స్పైకర్స్‌తో మంగళవారం తలపడనుంది.