సాంఘిక సంక్షేమ గురుకుల సొసైటీల్లో వరుస ఘటనలకు ప్రిన్సిపాళ్ల నిర్లక్ష్యమే కారణమని తెలుస్తున్నది. కాసుల కక్కుర్తి విద్యార్థుల ప్రాణాల మీదకు తెస్తున్నదని స్పష్టంగా తేలిపోతున్నది.
యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి బీసీ బాలికల హాస్టల్లో ఇద్దరు విద్యార్థినుల ఆత్మహత్య ఘటన మరువకముందే మరో హాస్టల్లో విద్యార్థులకు ఫుడ్పాయిజన్ కావడం కలకలం సృష్టించింది.