అల్పాపీడన ప్రభావంతో రెండు రోజులుగా కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో కుండపోతగా వర్షం కురుస్తున్నది. మంగళవారం రాత్రి నుంచి బుధవారం సాయంత్రం 5 గంటల దాకా ఎడతెరపి లేకుండా పడింది.
మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లో వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా ముసురు పడుతుండగా, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నదులు, ప్రాజెక్టులకు వరద పోటెత్తుతుండగా, వాగులు.. వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.
రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం ఆదాయ పన్ను శాఖ అధికారులు చేసిన దాడులు హాట్‌టాపిక్‌గా మారాయి. మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రాలతో పాటు పలు చోట్ల దాడులు జరిగాయి.