గత ఏడాది ‘ఓజీ’ చిత్రంతో తెలుగులో మంచి విజయాన్ని దక్కించుకుంది తమిళ సొగసరి ప్రియాంక మోహన్. తాజాగా ఈ భామ తమిళంలో మరో బంపరాఫర్‌ను సొంతం చేసుకుంది. శింబు ‘అరసన్' చిత్రంలో ఆమె కథానాయికగా ఎంపికైంది.
Arasan | విజయ్ సేతుపతి అరసన్లో విలన్‌గా నటిస్తున్నాడని వార్తలు వచ్చాయని తెలిసిందే. తాజాగా ఇదే విషయాన్ని అధికారికంగా ప్రకటించారు మేకర్స్. అరసన్ షూటింగ్ ఈ వీకెండ్లో మొదలు కానుంది.