SilambarasanTR | ప్రముఖ తమిళ దర్శకుడు వెట్రిమారన్, స్టార్ హీరో శిలంబరసన్ (శింబు) కాంబినేషన్లో ఒక సినిమా తెరకెక్కుతుందన్న విషయం తెలిసిందే. తమిళంలో ‘అరసన్’ (Arasan)గా రాబోతున్న ఈ చిత్రం తెలుగులో సామ్రాజ్యం పేరుతో విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా మూవీ నుంచి ఇంట్రో ప్రోమోను చిత్రయూనిట్ విడుదల చేసింది. ఈ ప్రోమో చూస్తుంటే శింబు పాత్రను పరిచయం చేసినట్లు కనిపిస్తుంది. ఒక కేసులో భాగంగా అరెస్ట్ అయిన శింబు తాను ఎందుకు అరెస్ట్ అయ్యాడు అనేది మీడియా ముందు చెప్పే క్రమంలో ఈ సన్నివేశం సాగుతుంది. ముగ్గురిని హత్య చేసిన కేసులో నిందితుడిగా ఉన్న శింబును జడ్జి నువ్వు ఈ హత్య చేశావా అంటూ అడుగగా.. తనకి ఎలాంటి సంబంధం లేదంటూ శింబు చెబుతాడు. అనంతరం శింబు అసలు పాత్ర రివీల్ అవుతుంది. ఇక ఈ వీడియోను తెలుగులో అగ్ర కథానాయకుడు జూనియర్ ఎన్టీఆర్ విడుదల చేశాడు. V Creations బ్యానర్‌పై ఈ సినిమాను కలైపులి ఎస్. థాను నిర్మిస్తుండగా.. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. తెలుగులో ఈ సినిమాను సురేష్ ప్రోడక్షన్స్ విడుదల చేయబోతుంది.