SilambarasanTR | ప్రముఖ తమిళ దర్శకుడు వెట్రిమారన్, స్టార్ హీరో శిలంబరసన్ (శింబు) కాంబినేషన్లో ఒక సినిమా తెరకెక్కుతుందన్న విషయం తెలిసిందే. ఈ సినిమాను #STR49 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కిస్తుండగా.. తాజాగా ఈ సినిమా టైటిల్‌తో పాటు ఫస్ట్‌లుక్‌ని విడుదల చేసింది చిత్రయూనిట్. ఈ సినిమాకు ‘అరసన్’ (Arasan) అని టైటిల్ పెట్టినట్లు చిత్రబృందం ప్రకటించింది. అలాగే సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది. ఈ ఫస్ట్‌లుక్‌లో శింబు రక్తం అంటిన చొక్కా ధరించి, ఒక సైకిల్ పక్కన నిలబడి, చేతిలో కత్తి పట్టుకుని మాస్ లుక్‌లో కనిపించారు. ఈ సినిమా వెట్రిమారన్ తీసిన ‘వడ చెన్నై’ సినిమా యూనివర్స్‌కు చెందినదిగా తెలుస్తోంది, అయితే ఇందులో ధనుష్ పాత్ర (అన్బు) ఉండదు. ‘వడ చెన్నై’ కోసం వెట్రిమారన్ మొదట శింబు కోసం రాసుకున్న స్క్రీన్ ప్లేను ఇప్పుడు ఈ సినిమాకు వాడుతున్నట్టు సమాచారం. అరసన్ అంటూ తమిళంలో రాజు అని అర్థం. V Creations బ్యానర్‌పై ఈ సినిమాను కలైపులి ఎస్. థాను నిర్మిస్తుండగా.. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు.
ஆளப்பிறந்த அரசன்
வெற்றியுடன் சிலம்பரசன்#VetriMaaran @SilambarasanTR_#STR49 #SilambarasanTR #VCreations47 #ARASAN pic.twitter.com/zLk8chzGJl— Kalaippuli S Thanu (@theVcreations) October 7, 2025