Arasan| తెలుగు, తమిళ భాషల్లో సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ యాక్టర్ శింబు (Silambarasan TR) బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్లో పెట్టాడని తెలిసిందే. వీటిలో ఒకటి వెట్రిమారన్ డైరెక్ట్ చేస్తున్న అరసన్. కలైపులి ఎస్ థాను నిర్మిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే మొదలు కావాల్సి ఉండగా ఆలస్యమవుతూ వస్తోంది. అయితే ఈ చిత్రానికి సంబంధించిన గాసిప్ ఒకటి నెట్టింట రౌండప్ చేస్తోంది.
విజయ్ సేతుపతి అరసన్లో విలన్‌గా నటిస్తున్నాడని వార్తలు వచ్చాయని తెలిసిందే. తాజాగా ఇదే విషయాన్ని అధికారికంగా ప్రకటించారు మేకర్స్. అరసన్ షూటింగ్ ఈ వీకెండ్లో మొదలు కానుంది. తెలుగులో ఈ చిత్రం సామ్రాజ్యం టైటిల్‌తో విడుదల కానుంది. మొత్తానికి ఓ వైపు హీరోగా అభిమానులను ఎంటర్టైన్ చేస్తూనే.. మరోవైపు విలన్‌గా కూడా నటిస్తూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తున్నాడు మక్కళ్ సెల్వన్.
వీ క్రియేషన్స్ బ్యానర్‌పై కలైపులి ఎస్ థాను ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీలో హీరోయిన్ ఎవరనేది మాత్రం సస్పెన్స్‌లో పెట్టేశారు. సమంత పేరు ప్రముఖంగా వినిపిస్తుండగా.. మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.
ఇప్పటికే అరసన్ ప్రోమో విడుదల చేశారని తెలిసిందే. ఒక కేసులో భాగంగా అరెస్ట్ అయిన శింబు తాను ఎందుకు అరెస్ట్ అయ్యాడు అనేది మీడియా ముందు చెప్పే క్రమంలో సాగే సీన్‌తో మొదలైంది ప్రోమో. ముగ్గురిని హత్య చేసిన కేసులో నిందితుడిగా ఉన్న శింబును జడ్జి నువ్వు ఈ హత్య చేశావా..? అంటూ అడుగగా.. తనకి ఎలాంటి సంబంధం లేదంటూ శింబు చెబుతాడు. అనంతరం శింబు అసలు పాత్ర రివీల్ అవుతుంది.
Official: #Arasan – VijaySethupathi On Board..😮🔥 #STR & VJS combo is back..⭐ #Vetrimaaran‘s Casting..👌 pic.twitter.com/n8M1rBZWwj
— Laxmi Kanth (@iammoviebuff007) November 25, 2025
Vishal | నటుడు విశాల్‌కు భారీ షాక్.. 30% వడ్డీతో చెల్లించాల్సిందేనంటూ మద్రాసు హైకోర్టు తీర్పు
Zubeen Garg | జుబీన్ గార్గ్ ప్రమాదవశాత్తూ మరణించలేదు.. ఆయన్ని హత్య చేశారు : సీఎం హిమంత శర్మ
Ravi Teja | ఇక ఓటీటీలో మాస్ జాతర మొదలు.. రవితేజ మూవీ ఓటీటీ రిలీజ్ ఎప్పుడంటే..!