గత ఏడాది ‘ఓజీ’ చిత్రంతో తెలుగులో మంచి విజయాన్ని దక్కించుకుంది తమిళ సొగసరి ప్రియాంక మోహన్. తాజాగా ఈ భామ తమిళంలో మరో బంపరాఫర్‌ను సొంతం చేసుకుంది. శింబు ‘అరసన్’ చిత్రంలో ఆమె కథానాయికగా ఎంపికైంది. ఈ విషయాన్ని ఓ అవార్డు వేడుకలో వెల్లడించింది ప్రియాంక మోహన్. వెట్రిమారన్ ఈ చిత్రానికి దర్శకుడు. ఉత్తర చెన్నై నేపథ్యంలో గ్యాంగ్‌స్టర్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో అవకాశం రావడం పట్ల ప్రియాంక మోహన్ ఆనందం వ్యక్తం చేసింది.
‘వెట్రిమారన్ మేకింగ్ ైస్టెల్ నాకు చాలా ఇష్టం. ఆయన ఎంచుకునే కథలు కూడా వాస్తవికతను ప్రతిబింబిస్తాయి. ‘అరసన్’లో నా పాత్ర మునుపెన్నడూ చూడని రీతిలో ఉంటుంది. అందరిని సర్ప్రైజ్ చేస్తుంది. ఈ సినిమా కోసం నేను నార్త్ చెన్నై తాలూకు యాసను నేర్చుకున్నా’ అని చెప్పింది ప్రియాంక మోహన్. ‘అరసన్’ చిత్రంలో విజయ్ సేతుపతి, ఆండ్రియా జెరేమియా, సముద్రఖని తదితరులు కీలక పాత్రల్ని పోషిస్తున్నారు.