ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల లెక్కింపు కేంద్రాల్లో వింతలు, విశేషాలు చోటుచేసుకుంటున్నాయి. అనంతపురం జిల్లా నల్లచెరువు మండలం తలమర్లవాండ్లపల్లిలో కౌంటింగ్ అధికారులకు ఓ వింత అనుభవం ఎదురైంది.
ఏపీలోని స్థానిక సంస్థల (జడ్పీటీసీ, ఎంపీటీసీ) ఎన్నికల ఫలితాలు అభ్యర్థులకు చెమటలు పట్టిస్తున్నాయి. ఓడుతామో.. గెలుస్తామో అని ఆలోచిస్తూ ఓ ఎంపీటీసీ అభ్యర్థి ఓట్ల లెక్కింపు కేంద్రంలోనే అస్వస్థతకు గురైంది.