Local Elections : స్థానిక సంస్థల ఓట్ల లెక్కింపునకు హైకోర్టు అనుమతి
ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు హై కోర్టు అనుమతి ఇచ్చింది.

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు హై కోర్టు అనుమతి ఇచ్చింది. లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడించవచ్చని పేర్కొన్నది. ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి, జస్టిస్ జె ఉమాదేవితో కూడిన ధర్మాసనం తీర్పును వెలువరించింది. సింగిల్ జడ్జి ఉత్తర్వులను తోసిపుచ్చిన ధర్మాసనం.. ఎన్నికలను సమర్థించింది.
ఈ ఏడాది ఏప్రిల్ 1న ఎస్ఈసీ నోటిఫికేషన్ ఇచ్చారు. దీని ఆధారంగా గత ఏప్రిల్ 8న రాష్ర్ట వ్యాప్తంగా నిర్వహించిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్‌ను హైకోర్టు సింగిల్ జడ్జి మే 21న రద్దు చేస్తూ తీర్పు ఇచ్చిన విషయం విదితమే. సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలకు విరుద్ధంగా నోటిఫికేషన్ ఉందని పేర్కొన్నారు. అయితే హైకోర్టు ధర్మాసనం తాజాగా నోటిఫికేషన్ ఇవ్వాలని ఆదేశించింది.
సుప్రీం కోర్టు ఆదేశాలకు కట్టుబడి పోలింగ్ తేదీకి నాలుగు వారాల ముందు తిరిగి ఎన్నికల కోడ్ విధించాలని స్పష్టం చేశారు. సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఎన్నికల్లో పోటీ చేసిన కొందరు హైకోర్టులో అప్పీల్ చేశారు. వాటిపై ఆగస్టు 5న విచారణ జరిపిన ధర్మాసనం తీర్పును రిజర్వు చేసింది. తాజాగా ఓట్ల లెక్కింపునకు సమర్థిస్తూ ఈ రోజు తీర్పును వెలువరించింది.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mammootty | ఏడేళ్ల తర్వాత తమిళంలో నటిస్తున్నా.. ‘ఓం’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మమ్ముట్టి!
Mohammed Shami: టెస్టు క్రికెట్‌కు అల్విదా ప్రకటించిన బౌలర్ షమీ.. వీడియో
Doodimetla Balaraj Yadav | కాంగ్రెస్ ప్రభుత్వానికి మరో ఎదురుదెబ్బ.. దూదిమెట్లకు బెయిల్ మంజూరు
Salman Khan | ప్రభుత్వ ఒత్తిడితో కథ మార్చలేదు.. ‘మాతృభూమి’ వివాదాలపై సల్మాన్ ఖాన్ ఫుల్ క్లారిటీ!
RC 17 | ఆర్సీ17లో రామ్ చరణ్ సరసన ఆ ఇద్దరిలో ఒకరు .. హీరోయిన్ విషయంలో సుకుమార్ కీలక నిర్ణయం!
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

