చమటలు పట్టించిన ఎంపీటీసీ ఫలితాలు.. బీపీ ఎక్కువై అస్వస్థతకు గురైన అభ్యర్థి
ఏపీలోని స్థానిక సంస్థల (జడ్పీటీసీ, ఎంపీటీసీ) ఎన్నికల ఫలితాలు అభ్యర్థులకు చెమటలు పట్టిస్తున్నాయి. ఓడుతామో.. గెలుస్తామో అని ఆలోచిస్తూ ఓ ఎంపీటీసీ అభ్యర్థి ఓట్ల లెక్కింపు కేంద్రంలోనే అస్వస్థతకు గురైంది.

అమరావతి: ఏపీలోని స్థానిక సంస్థల (జడ్పీటీసీ, ఎంపీటీసీ) ఎన్నికల ఫలితాలు అభ్యర్థులకు చెమటలు పట్టిస్తున్నాయి. ఓడుతామో.. గెలుస్తామో అని ఆలోచిస్తూ ఓ ఎంపీటీసీ అభ్యర్థి ఓట్ల లెక్కింపు కేంద్రంలోనే అస్వస్థతకు గురైంది. వివరాల్లోకి వెళితే.. కడప జిల్లా గోపవరం మండలం బ్రాహ్మణపల్లె టీడీపీకి చెందిన ఎంపీటీసీ అభ్యర్థి ధనలక్ష్మి ఉదయం నుంచే ఓట్ల లెక్కింపు కేంద్రంలోనే ఉంది. కాగా కౌంటింగ్ మొదలైనప్పటి నుంచి నువ్వా.. నేనా అన్నట్లు ఉత్కంఠ కొనసాగింది.
తొలి రౌండ్ నుంచి ఆమె ఆధిక్యంలో కొనసాగుతున్నా గెలుపా.. ఓటమా.. అనే భావన ఆమెను వెంటాడింది. చివరికి గెలిచినప్పటికీ.. మరింత ఉద్వేగానికి లోనై తీవ్ర అస్వస్థతకు గురైంది. దీంతో కౌంటింగ్ కేంద్రంలో ఉన్న అందరూ ఒకింత ఆందోళనకు గురయ్యారు. వెంటనే ఆమెను ఓట్ల లెక్కింపు కేంద్రం నుంచి బయటికి తీసుకొచ్చారు. అనంతరం వైద్య సిబ్బంది పరిక్షించగా ఆమెకు బీపీ ఎక్కువగా ఉన్నట్టు తేలింది. అనంతరం ధనలక్ష్మిని 108 వాహనంలో ఆస్పత్రికి తరలించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూధన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్టాప్ అందజేత
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

