రిజిస్ట్రేషన్ల కోసం వచ్చే వారి నుంచి అక్రమంగా లక్షల రూపాయలు వసూలు చేస్తున్న సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయ సిబ్బంది, డాక్యుమెంట్ రైటర్లపై అవినీతి నిరోధకశాఖ కొరడా ఝులిపించింది.
భూమి రిజిస్ట్రేషన్ చేసేందుకు రూ.15 వేలు డిమాండ్ చేసి, మధ్యవర్తి ద్వారా రూ.10 వేల లంచం తీసుకుంటుండగా జగిత్యాల జిల్లా రాయికల్ మండల ఇన్చార్జి తహసీల్దార్ గణేశ్‌ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.