కాక్రోచ్ ఉద్యమం మే 16న ప్రారంభమైంది. భారత ప్రధాన న్యాయమూర్తి యువ నిరుద్యోగులను కాక్రోచ్లతో, అంటే బొద్దింకలతో పోల్చినట్లుగా వార్తలు రావడం నేపథ్యంగా ఈ వ్యంగ్య ఉద్యమం మొదలైంది.
రాజకీయ వ్యంగ్యాత్మక ఉద్యమ పార్టీ కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) ఎక్స్ ఖాతాను వెంటనే పునరుద్ధరించాలని ఆదేశాలు జారీ చేసేందుకు ఢిల్లీ హైకోర్ట్ శుక్రవారం నిరాకరించింది.