న్యూఢిల్లీ: రాజకీయ వ్యంగ్యాత్మక ఉద్యమ పార్టీ కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) ఎక్స్ ఖాతాను వెంటనే పునరుద్ధరించాలని ఆదేశాలు జారీ చేసేందుకు ఢిల్లీ హైకోర్ట్ శుక్రవారం నిరాకరించింది. తన ఎక్స్ అకౌంట్‌ను జాతీయ భద్రతా కారణాల నెపంతో బ్లాక్ చేయడాన్ని సవాల్ చేస్తూ సీజేపీ స్థాపకుడు అభిజిత్ దీప్కే దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ పురుషైంద్ర కౌరవ్ స్పందిస్తూ ఈ విషయాన్ని సమీక్ష ప్యానెల్ పరిశీలించాలని ఆదేశించారు.
ఈ విషయమై కేంద్రానికి, ఎక్స్‌కు కోర్ట్ నోటీసులు జారీ చేసింది. పిటిషనర్ కోరిన మధ్యంతర ఉపశమనం మంజూరు కాకపోవడంతో.. ప్రస్తుతానికి సీజేపీ ఎక్స్ బ్లాక్ చేసే ఉంటుంది.