జాతీయ పుస్తక ప్రదర్శన జాతరను తలపించింది.ఎన్టీఆర్ స్టేడియం వేదికగా జరుగుతున్న హైదరాబాద్ బుక్‌ఫెయిర్‌కు రెండో రోజు శుక్రవారం భారీగా సందర్శకులు తరలివచ్చారు.
తెలంగాణ సాయుధ పోరాటం నుంచి నక్సల్బరీ, తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటం వరకు పుస్తకాలే ఉద్యమాలను నడిపించాయని సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ గుర్తుచేశారు.
జ్ఞాన సంపదను జాతికి అందించాలనే తెలంగాణ ప్రభుత్వం ప్రతియేటా నగరంలో పుస్తక వేడుక నిర్వహణకు ప్రోత్సహిస్తున్నదని ఎక్సైజ్, పర్యాటక, సాంసృతిక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు.
విద్యార్థులు, యువత పుస్తక పఠనం చేయాలి. తద్వారా సామాజిక, ఆర్థిక, రాజకీయ చైతన్యం అందిపుచ్చుకోవాలి. శాస్త్రీయ దృక్పథాన్ని అలవరుచుకోవాలి. ప్రపంచ పరిణామాలను అర్థం చేసుకోవాలి.