వనపర్తి జిల్లాలో ఎండ తీవ్రత క్రమంగా పెరుగుతున్నది. అన్ని ప్రాం తాల్లో సాధారణం కన్నా 2నుంచి 3 డిగ్రీలు అదనంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉద యం 7నుంచి సాయంత్రం 6 గంటల వరకు భానుడి తాపం కొనసాగుతుంది.
గ్రేటర్లో ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు గరిష్ఠం 35.2, కనిష్ఠం 23.5 డిగ్రీలు, గాలిలో తేమ 41 శాతంగా నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.
భానుడు భగభగ మండుతున్నాడు. గతనెల చివరి వారం నుంచే తన ప్రతాపాన్ని చూపిస్తున్నా.. కొన్ని రోజులుగా మరింతగా సెగలు కక్కుతూ జనాలకు చెమటలు పట్టిస్తున్నాడు. మార్చి నెల ఆరంభంలోనే ఇలా ఉంటే మున్ముందు మరెంత తీవ్రంగా �
వేసవి కాలం ప్రారంభానికి ఇంకో రెండు వారాల సమయం ఉన్నా అప్పుడే ఎండలు అదరగొడుతున్నాయి. ఈ నెల మొదటి వారం వరకు గరిష్ఠ ఉష్ణోగ్రతలు 30 డిగ్రీల లోపే ఉండగా, రెండు మూడు రోజులుగా 33 డిగ్రీలు నమోదవుతున్నాయి.