హుజూర్ నగర్, మే 9 : సూర్యాపేట జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఈతకు వెళ్లి ఇద్దరు మృతి చెందారు. ఈ విషాదకర సంఘటన హుజూర్నగర్ చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. నారాయణపేట జిల్లాకు చెందిన గొర్ల కాపర్లు శేఖర్(14), లక్ష్మణ్(21) ప్రతి ఏడాది గొర్లను కాయడానికి హుజూర్‌నగర్‌కు వస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే సమీపంలోని వ్యవసాయ బావిలో నిన్న ఈత నేర్చుకున్నారు.
శుక్రవారం ఎవరూ లేని సమయంలో ఈత కోసం బావిల దూకగా.. శేఖర్ బావిలో లోతు ఎక్కువ కావడంతో మునిగిపోయాడు. ఇది గమనించిన లక్ష్మణ్ శేఖర్‌ను రక్షించడానికి వెళ్లగా లక్ష్మణ్ మెడను శేఖర్ పట్టుకొని విడవకపోవడంతో ఇద్దరూ బావిలో మునిగి చనిపోయారు. రెస్క్యూ టీం బావిలోని మృతదేహాలను బయటికి తీశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.