తుంగతుర్తి : ఎస్ఆర్ఎస్పీ ( SRSP ) కాలువల ద్వారా కాళేశ్వరం గోదావరి జలాలు అందజేసి రైతులను ఆదుకోవాలని తుంగతుర్తి మండల కేంద్రంలోని రైతులు నిరసన వ్యక్తం చేశారు. గురువారం కాలువలో బైఠాయించి తమ పంట పొలాలను కాపాడాలని కోరుతూ నినాదాలు చేశారు.
కేసీఆర్( KCR) హయాంలో పదేళ్లపాటు ప్రతి ఎకరానికి నీరంది పచ్చగా మారాయని, కాంగ్రెస్ ( Congress ) హయాంలో పంటలు ఎండిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. తమ సమస్యను ఎవరూ పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం చేతగాని పాలన వల్ల పంటలు ఎండిపోతున్నాయని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి పంట పొలాలకు నీటిని విడుదల చేసి ఆదుకోవాలని కోరారు. నిరసనలో రైతులు వీరబోయిన నాగయ్య , గుజ్జ చందర్ రావు, పాలడుగు నాగరాజు తదతరులు ఉన్నారు.