హజూర్ నగర్ : ధనవంతుల సంపదలో పేదలకు కూడా హక్కు ఉందని దివ్య ఖుర్ఆన్లో అల్లాహ్ చెప్పారని, ఆయన చూపించిన మార్గంలోనే జమాతే ఇస్లామి హింద్(Jamaat-e-Islami Hind) సంస్థ కార్యక్రమాలు నిర్వహిస్తుందని సంస్థ సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణ అధ్యక్షులు షేక్ మజీద్ (మ్యారేజ్ బ్యూరో) అన్నారు. ముస్లింల పవిత్ర ఆరాధనలకు, దాతృత్వానికి ప్రతీకగా నిలిచే రంజాన్ మాసం ప్రారంభమైన సందర్భంగా ఉపవాస దీక్షలకు ఉపక్రమించిన నిరుపేద ముస్లిం కుటుంబాలకు జమాతే ఇస్లామి హింద్ సంస్థ సహకారంతో పట్టణ అధ్యక్షులు షేక్ మజీద్ ఆధ్వర్యంలో ఆదివారం హుజూర్ నగర్ మున్సిపల్ పరిధిలోని వివిధ ప్రాంతాలకు చెందిన నిరుపేద ముస్లిం కుటుంబాలకు పవిత్ర రంజాన్ మాస కానుకగా 25 కిలోల బియ్యం, నిత్యావసర సరుకులు, కొంత నగదు అందజేశారు.
ఈ సందర్బంగా సంస్థ పట్టణ అధ్యక్షులు షేక్ మజీద్ మాట్లాడుతూ నిరుపేద ముస్లింలకు నిత్యావసర సరుకులు అందించడం పేద మహిళలు, వితంతువులకు ఉపాధి అవకాశాల ద్వారా ఆర్థిక స్వావలంబన కల్పించి వారి జీవితాల్లో వెలుగు నింపాలనేదే జమాతే ఇస్లామి హింద్ సంస్థ లక్ష్యమని వెల్లడించారు. హుజూర్ నగర్ పట్టణంలో నిరుపేద ముస్లిం కుటుంబాలకు తమ జమాతే ఇస్లామి హింద్ సంస్థ ఎల్లపుడూ సహాయక సహకారాలు అందిస్తూ అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలోనవాబ్ జాని, షేక్ సైదా, నందిగామ నాగేందర్ పాల్గొన్నారు.