చివ్వేంల, జూన్ 17 : ప్రభుత్వ భూములు, చెరువుల్లో అక్రమంగా తవ్వకాలు జరిపితే చట్ట పరమైన చర్యలు తప్పవని తహసిల్దార్ తిరుపతి ప్రకాశ్ రావు హెచ్చరించారు. మంగళవారం మండల కేంద్రంలోని ఊర చెరువులో అక్రమంగా మట్టిని తవ్వి తరలిస్తున్నారనే సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకొని మట్టిని తరలిస్తున్న 3 ట్రాక్టర్లు, 1 జేసీబీని పోలీసులకు అప్పగించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ భూములు, చెరువులు ఆసరాగా చేసుకుని కొందరు దళారులు మట్టిని అక్రమంగా తవ్వి వెంచర్లకు తరలిస్తున్నారన్నారు. అలాంటి వారిపై ప్రభుత్వం చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆయన వెంట ఆర్ఐ శ్రావణి, సిబ్బంది ఉన్నారు.