సూర్యాపేట రూరల్, మార్చి 1: సూర్యాపేట పట్టణ శివార్లలోని సువేన్ ఫార్మాకు (Suven Pharma) వ్యతిరేకంగా కార్మికులు ఆందోళనకు దిగారు. నెల రోజులు పనిచేయించుకుని 20 రోజుల మాత్రమే జీతం చెల్లిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కంపెనీ యాజమాన్యం శ్రమ దోపిడీకి పాల్పడుతున్నదని మండిపడ్డారు. కంపెనీ ప్రధాన గేటు వద్ద బైఠాయించారు.
యాజమాన్యం మారడంతో గత కొన్ని రోజులుగా కంపెనీలో పని చేస్తున్న కార్మికులకు నెల రోజులు పనిచేస్తే 20 రోజులకు మాత్రమే జీతాలు ఇస్తున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల శ్రమ దోపిడీ చేసి జీతాలు ఇవ్వకుండా ఉన్న సువేన్ కంపెనీ యాజమాన్యంపై చర్యలు తీసుకొని, నెలరోజుల జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.