e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, June 19, 2021
Home జిల్లాలు అజరామరం సుద్దాల హన్మంతు పాటలు

అజరామరం సుద్దాల హన్మంతు పాటలు

అజరామరం సుద్దాల హన్మంతు పాటలు

ఆలేరు టౌన్‌, జూన్‌ 7 : ప్రజాకవిగా సుద్దాల హన్మంతు సృ ష్టించిన పాటలు ప్రజల నాలుకలపై నిలిచి శాశ్వతత్వం పొం దాయని ప్రముఖ దర్శకుడు, నిర్మాత నరసింగరావు అన్నా రు. జూమ్‌ ద్వారా సోమవారం జరిగిన హన్మంతు 112వ జయంతి వేడుకలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసం గించారు. జీవితంలో ఎదురైన సంఘటనలు పాటలుగా మ లచడంతో పాటు ఆనాటి సామాజిక పరిస్థితులను కూడా ప్ర జాసాహిత్యంగా తన దైన శైలిలో అందించిన ఘనత హన్మం తుకు దక్కుతుందన్నారు. మా భూమి సినిమాలో టైటిల్‌ సాంగ్‌గా పల్లె టూరి పిల్లగాడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన సందర్భాన్ని గుర్తు చేశారు. హనుమంతు పాటలపై మరింత లోతైన పరిశోధన జరగాల్సిన అవసరం ఉందన్నారు. తెలం గాణ భాష సాంస్కృతిక శాఖ డైరెక్టర్‌ మామిడి హరికృష్ణ మా ట్లాడుతూ ఉద్యమం తెలంగాణ ప్రాంతంలో మమేక మైంద ని, అణచివేత ఎదురైన ప్రతి సందర్బంలో కవులు, కళాకారు లు తమదైన రీతిలో తమ సాహిత్యంలో, కళా ప్రదర్శనలో ఎదిరించారన్నారు. ఆయన జీవితం ద్వారా ఈతరం వ్యక్తిత్వ వికాసాన్ని పొందవచ్చునన్నారు. సుద్దాల హనుమంతు వార సుడు, జాతీయ ఉత్తమ సినీగేయ పురస్కార గ్రహీత డా. సు ద్దాల అశోక్‌తేజ స్వాగతోపన్యానం చేశారు. సుద్దాల ఫౌండేష న్‌- తేజ సాహిత్య సేవా సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించి న జయంతి వేడుకకు డా. పోరెడ్డి రంగయ్య సమన్వయ కర్త గా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో ప్రముఖ కవి శ్రీరామో జు హరగోపాల్‌, గాయని భారతి, గాయకుడు సుద్దాల ప్రభా కర్‌తేజ, సత్యనారాయణ, డా. కృష్ణకౌండిన్య, ఆచార్య పిల్లల మర్రి రాములు, బండిరాజుల శంకర్‌, సుదర్శన్‌, చారి తది తరులు ప్రసంగించారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
అజరామరం సుద్దాల హన్మంతు పాటలు

ట్రెండింగ్‌

Advertisement