రామగిరి,జూలై 23: విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీ సేందుకు నిర్వహించే ‘ఇన్స్పైర్-మానక్’ అవార్డు 2022-23 నమోదు(రిజిస్ట్రేషన్స్)లో జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలని ప్రధానోపాధ్యాయులు, సైన్స్టీచర్లు కృషి చేయాలని డీఈఓ భిక్షపతి అన్నారు. నల్లగొండ సెయింట్ ఆల్ఫోన్స్ పాఠశాలలో శనివారం జిల్లాలోని ఎంఈఓలు, ఉన్నత, ప్రాథమికోన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ‘ఇన్స్పైర్-మానక్’ అవార్డుల రిజిస్ట్రేషన్స్ నమోదుపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ఆయా పాఠశాలల నుంచి కచ్చితంగా ఐదు ప్రాజెక్టులను పూర్తి చేయాలన్నారు. ఎంపికైన ప్రాజెక్టులకు రూ. 10,000 చొప్పున విద్యార్థుల ఆకౌంట్లలో జమ అవుతాయన్నారు. జిల్లా సైన్స్ అధికారి వనం లక్ష్మీపతి మాట్లాడుతూ రిజిస్ట్రేషన్స్ నమో దులో సందేహాలు ఉంటే 98485 78845 నంబ ర్లో సంప్రదిదించాలన్నారు. గతంలో మాదిరిగానే ఈసారీ జిల్లాను రాష్ట్రంలో ముందువరుసలో ఉంచాలన్నారు. అనంతరం పాఠశాల విద్యాశాఖ నిర్వహించే ‘తొలిమెట్టు’ కార్యక్రమ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాన్ని అన్ని ప్రాథమిక పాఠశాలల్లో విజయవంతం చేయాలని కోరారు. సమగ్రశిక్ష సెక్టోరియల్ అధికారులు రామచంద్రయ్య, వీరేందర్, ఎంఈఓలు బాలాజీనాయక్, రాములు, హెచ్ఎంలు పాల్గొన్నారు.