హాలియా, జూలై 23 : టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలను శనివారం ఆస్ట్రేలియాలోని సిడ్నీ, మెల్బోర్న్, కాన్బెర్రా, బ్రిస్బేన్, అడిలైడ్ నగరాల్లో నాగేందర్రెడ్డి కాసర్ల, రవి సాయల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి ఆనందాన్ని పంచుకున్నారు. రక్తదానం చేశారు. ఈ సందర్భంగా రవి సాయల మాట్లాడుతూ తెలంగాణ పునర్నిర్మాణానికి, బంగా రు తెలంగాణ సాధించేందుకు పూర్తి సహకారం అందిస్తామన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ ఆస్ట్రేలియా కోర్ కమిటీ నాయకులు నోముల ఝాన్సీ, గాయత్రి, రాకేశ్, సిద్ధు, రమేశ్, వీరేందర్ పాల్గొన్నారు.