ఏడో వార్డులో మాట్లాడుతున్న మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జి బండా ప్రకాశ్, మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, టీబీజీకేఎస్ నేత రాజిరెడ్డి
కృష్ణ కాలనీ, ఫిబ్రవరి 7 : రాష్ట్రంలో రాక్షస పాలన రాజ్యమేలుతున్నదని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. శనివారం ఆయన భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 5, 6 వార్డుల్లోని కృష ్ణకాలనీ, యాదవ్ కాలనీ, 7వ వార్డులోని టీ-2, ఎంసీ క్వార్టర్స్, 8వ వార్డు జవహర్‌నగర్ కాలనీ, 11వ వార్డు వేశాలపల్లి, 20వ వార్డు శాంతినగర్, హనుమాన్ నగర్, 22వ వార్డు లక్ష్మీనగర్, 28వ వార్డు ఎండీ క్వార్టర్స్‌లో మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జి బండా ప్రకాశ్, టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మిరియాల రాజిరెడ్డితో కలిసి ప్రచారం నిర్వహించారు.
ఇంటింటికి తిరుగుతూ 5, 6, 7, 8, 11, 20, 22, 28 వార్డుల అభ్యర్థులు కట్ల పూర్ణచందర్, ఎడ్ల మౌనిక, రత్నం సుమంజలి, బెజ్జల శ్యామల, మోతే రాజుపటేల్, నగావత్ ప్రభాకర్, బుర్ర రమాదేవీ, భోగం నరేందర్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఆయా వార్డుల్లో గండ్ర మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి చేయించుకున్న సర్వేలో భూపాలపల్లిలో కాంగ్రెస్ ఓడిపోతుందని తేలడంతో, జీవో కాపీలు లేని అభివృద్ధి పనుల పేరుతో రోజు కో మంత్రిని పంపించి భూపాలపల్లి చుట్టూ పెద్దపెద్ద శిలాఫలకాలు వేయించాడని అన్నారు.
అయినా, కాంగ్రెస్ నాయకులను ప్రజలు స్వీకరిస్తలేరని తెలుసుకొని నేడు భూపాలపల్లికి సీఎం రేవంత్‌రెడ్డి వస్తున్నాడని అన్నారు. దోపిడీ దొంగల నుంచి భూపాలపల్లి విముక్తి పొందాలంటే మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. అనంతరం 20వ వార్డుకు చెందిన బీజేపీ నాయకులు నీలాల రమేశ్, తిక్క నాని, ఏఐటీయూసీ నాయకుడు రాకేశ్ వారి పార్టీలకు రాజీనా మా చేసి గండ్ర వెంకటరమణారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ అర్బన్ అధ్యక్షుడు కటకం జనార్దన్, మాజీ ఫ్లోర్ లీడర్ నూనె రాజు, వార్డుల అధ్యక్షులు ఎస్ శ్యామ్, సాంబయ్య, ఎల్ దేవేందర్, కుమార్, రమేశ్, రాజు, నాయకులు పాల్గొన్నారు.