
హాలియా, ఆగస్టు 13 : హాలియా మున్సిపాలిటీని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతానని నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు. 11వ వార్డులో రూ.10లక్షలతో నిర్మిస్తున్న సీసీ, డ్రైనేజీ పనులకు శుక్రవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మున్సిపాలిటీ అభివృద్ధికి అందరూ సహకరించాలని కోరారు.
పెద్దవూర, హాలియా, తిరుమలగిరి (సాగర్) మండలాల్లోని పలు గ్రామాలకు చెందిన 8 మందికి సీఎం సహాయ నిధి నుంచి రూ. 1,92, 500 మంజూరయ్యాయి. సంబంధిత చెక్కులను క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే నోముల భగత్ లబ్ధిదారులకు అందజేశారు. కార్యక్రమాల్లో జడ్పీ వైస్‌చైర్మన్ ఇరిగి పెద్దులు, మున్సిపల్ వైస్ చైర్మన్ సుధాకర్, మున్సిపల్ చైర్పర్సన్ సలహాదారుడు వెంపటి శంకరయ్య, టీఆర్ఎస్ హాలియా, పెద్దవూర, తిరుమలగిరి(సాగర్) మండలాధ్యక్షులు కూరాకుల వెంకటేశ్వర్లు, జటావత్ రవినాయక్, పిడిగం నాగయ్య, కౌన్సిలర్లు వెంకటయ్య, వర్రా వెంకట్‌రెడ్డి, అన్నెపాక శ్రీను, ప్రసాద్‌నాయక్, కోఆప్షన్ సభ్యుడు సైదులు, రావుల లింగయ్య, అన్వరొద్దీన్, సత్యం, రాంబాబు, ముత్యాలు, వెంకన్న, శేఖర్ పాల్గొన్నారు.
నందికొండ : టీఆర్ఎస్ నాయకుడు బండారు హనుమంతరావు ప్రథమ వర్ధంతి పైలాన్ కాలనీలో జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నోముల భగత్ పాల్గొని హనుమంతరావు చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మంద రఘువీర్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కర్ణ బ్రహ్మరెడ్డి, నాయకులు ఈర్ల రామకృష్ణ, రమేశ్, చంద్రయ్య, వీరయ్య, రాంబాబు, పాపిరెడ్డి పాల్గొన్నారు.
పెద్దవూర : మండలంలోని నాయనివానికుంట గ్రామంలో నూతనంగా నిర్మించిన గంగాదేవి ఆలయంలో అమ్మవారి విగ్రహాన్ని వైభవంగా ప్రతిష్ఠించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నోముల భగత్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేను శాలువతో సన్మానించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రవి నాయక్, నాయకులు నడ్డి బాలరాజ్, రమావత్ వెంకటేశ్వర్లు, జానపాటి శ్రీను, కొట్టె వెంకటయ్య, నాగరాజు, భిక్షం, రఘువీర్, శ్రీకర్, లవకుమార్ పాల్గొన్నారు.