తుంగతుర్తి: సమయపాలన పాటించని టీచర్లు, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని అధికారులను తుంగతుర్తి ఎమ్మెల్యే సామేలు ఆదేశించారు. సోమవారం తుంగతుర్తి మండల కేంద్రంలోని తెలంగాణ గిరిజన సంక్షేమ బాలికల పాఠశాల, కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. 30 మంది టీచర్ల గాను కేవలం ఐదుగురు మాత్రమే విధులకు హాజరయ్యారు కావడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు.
అనంతరం విద్యార్థినిలతో మాట్లాడి వారి సమస్యలను అడిగితే తెలుసుకున్నారు. వంట గదిలో ఉన్న నిత్యావసర వస్తువులను పరిశీలించారు. మెనూ ప్రకారం భోజనం అందించాలని, విద్యార్థులకు అందించే భోజనంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని ఎమ్మెల్యే హెచ్చరించారు.
ఇవి కూడా చవండి..
Oscar Awards | వేశ్య కథకు అవార్డుల పంట.. తక్కువ బడ్జెట్తో విడుదలై రికార్డులు కొల్లగొట్టిన అనోరా
Sangareddy | సంగారెడ్డి జిల్లాలో దారుణం.. తల్లిని కత్తితో పొడిచి చంపిన తనయుడు
Haleem shops | ప్రారంభమైన రంజాన్ ఉపవాస దీక్షలు.. పట్నంలో జోరుగా వెలసిన హలీం దుకాణాలు