కోదాడ నమస్తే తెలంగాణ : కోదాడ నియోజక అభివృద్ధి ప్రాధాన్యత క్రమంలో అన్ని రంగాలను అభివృద్ధి చేస్తామని, తనను నమ్మి ఓట్లు వేసి గెలిపించిన ప్రజల రుణం తీర్చుకుంటానని ఎమ్మెల్యే పద్మావతి పేర్కొన్నారు. ఆదివారం కోదాడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ వ్యాప్తంగా మంజూరైన 267 (87 లక్షల 78,500) చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఒక రూపాయి అవినీతి లేకుండా నేరుగా లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేస్తున్నామన్నారు.
ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మహాలక్ష్మీ పథకాన్ని ప్రవేశపెట్టి అమలు పరుస్తుందన్నారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటామన్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో వందలాది కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్న విషయాన్ని ఆమె గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఆయా మండలాల అధ్యక్షులు నియోజకవర్గ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.