చిలుకూరు : ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన ఎంఈవో సైదానాయక్ భార్య ఉపాధ్యాయు రాలు మీనాక్షి మరణించడం బాధాకరం అని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. మంగళవారం మండల పరిధిలోని దూదియాతండాలో సైదానాయక్ కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్బంగా ఆయన వారి కుటుంబానికి మనోధైర్యం కల్పించారు. అనంతరం మృతురాలి చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.
ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కొండా సైదయ్య, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు దొడ్డా సురేష్‌బాబు, మాజీ జెడ్పీటీసీ శివాజీ నాయక్, ఎంపీటీసీ కౄష్ణచైతన్య, పీఎసీయస్ చైర్మన్ అల్సకాని జనార్ధన్, నాగేశ్వరరావు, వాసు, సకురాం, తదితరులు పాల్గొన్నారు.