మఠంపల్లి: ప్రముఖ పుణ్యక్షేత్రమైన మట్టపల్లిలో సోమవారం చెంచులక్ష్మి, రాజ్యలక్ష్మి సమేత నరసింహుని కల్యాణం కమ నీయంగా నిర్వహించారు. తెల్లవారుజామున సుప్రభాత సేవతో ప్రారంబించి ఆంజనేయస్వామికి ఆకు పూజ నిర్వహించా రు.
అనంతరం స్వామివారి కల్యాణ మండలంలో స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు ప్రత్యేక పూజలు చేసి పట్టు వస్ర్తాలతో అలంకరించి వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ అత్యంత వైభవంగా కల్యాణతంతు నిర్వహించారు.
అనంతరం భక్తులకు దైవదర్శనంతో పాటు ప్రసాద వితరణ చేశారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్త చెన్నూరి విజయ్‌కుమార్, ఈవో నవీన్, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.