మఠంపల్లి: కృష్ణానది తీరాన భక్తుల పాలిట కొంగు బంగారంగా వెలిసిన మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహుడి నిత్యకల్యాణం మంగళవారం శాస్ర్తోక్తంగా నిర్వహించారు. స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు.
పట్టువస్ర్తాలతో అలంకరించి కల్యాణంతు నిర్వహించారు. అనంతరం తీర్ధప్రసాద వినియోగం గావించారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్త చెన్నూరి మట్టపల్లిరావు, ఈవో నవీన్, అర్చకులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.