మోత్కూరు: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి శనివారం మండల పర్యటనను విజయవంతం చేయాలని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ తెలిపారు. గురువారం మండల పరిధిలో ని దత్తప్పగూడెంలో రైతు వేదిక భవనంను ఆయన సందర్శించి పరిశీలించారు. ప్రభుత్వం రైతులకు అన్ని రకాల సలహా లు, సూచన లను అందించడానికి అన్ని హంగులతో రైతువేదిక భవన సముదాయాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
శనివారం ఉదయం 11గంటలకు దత్తప్పగూడెంలో రైతు వేదిక ప్రారంభోత్సవం, మధ్యాహ్నాం మోత్కూరు వ్యవసాయ మార్కెట్ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొంటారని తెలిపారు. మంత్రులతో పాటు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సిలు పాల్గొంటారని తెలిపారు. ప్రజలు, ప్రజా ప్రతినిధులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
కార్యక్రమంలో ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి, మోత్కూరు మున్సిపల్ చైర్ పర్సన్ తీపిరెడ్డి సావి త్రీరెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొణతం యాకుబ్‌రెడ్డి, రైతు సహకార సంఘం చైర్మన్ కంచర్ల అశోక్‌రెడ్డి, మం డలాధ్యక్ష, కార్యదర్శులు పొన్నేబోయిన రమేశ్, గజ్జి మల్లేశ్, రైతు బంధు మండలాధ్యక్షుడు కొండ సోంమల్లు, సర్పంచు ఎలుగు శోభ, వ్యవసా య ,పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు.