సూర్యాపేట: ప్రియురాలి మరణాన్ని జీర్ణించుకోలక ప్రియుడు కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రెండు రోజుల వ్యవధిలో ప్రేమికులిద్దరు ప్రాణాలొదలడంతో సూర్యాపేట జిల్లాలోని హుజూర్నగర్లో విషాదం చోటు చేసుకుంది. హుజూర్నగర్ మండలం బూరుగడ్డకు చెందిన పవన్, మౌనిక గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే మౌనిక.. గురువారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నది. దీంతో ప్రియురాలి మరణం తట్టుకోలేక పవన్ కూడా నిన్న పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. ప్రస్తుతం ఆ వీడియో వైరవలవుతున్నది.