సూర్యాపేట : జిల్లా కేంద్రంలోని సంతోషి మాత దేవస్థానంలో(Santoshi Matha Temple) శ్రీ జగద్గురు పుష్పగిరి శంకరాచార్య మహాసంస్థాన పీఠాధిపతులు శ్రీ విద్యా శంకర భారతి మహాస్వామి చేతుల మీదుగా జీవ ధ్వజ యంత్ర పుణప్రతిష్ట మహోత్సవ కార్యక్రమాన్ని సోమవారం కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రాత కాలిక పూజ, రత్నదివాసం, రత్నాదివాసం రేవతి నక్షత్ర యుక్త మేష లగ్నం పుష్కరాంశమున జీవద్వాజ యంత్రస్థాపన, బింబస్థాపన, ధ్వజస్తంభ ప్రతిష్టాపన, కలన్యాసం, కళాహోమం కార్యక్రమాలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు నూక వెంకటేశం గుప్తా, బ్రాహ్మడ్లపల్లి మురళీధర్, గోపారపు రాజు, బచ్చు పురుషోత్తం, తదితరులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి
Sangareddy | సంగారెడ్డి జిల్లాలో దారుణం.. తల్లిని కత్తితో పొడిచి చంపిన తనయుడు
Oscar Awards | అనోరాకు అవార్డుల పంట.. ఆస్కార్ విజేతలు వీళ్లే