సూర్యాపేట : పనికిమాలిన కాంగ్రెస్ పార్టీకి పనికిరాని అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ విర్శించారు. కేసీఆర్ను పట్టుకొని అనుచిత వ్యాఖ్యలు చేస్తే చేస్తూ ఊరుకోం ఖబర్దార్ బిడ్డా.. బట్టలు ఊడదీసి కొడతాం అని హెచ్చరించారు.
సీఎం కేసీఆర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మతో ఎమ్మెల్యే శవ యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..మీ నాయకుడు రాహుల్ గాంధీని పట్టుకొని బీజేపీ ముఖ్యమంత్రి మాట్లాడితే భారత దేశ బిడ్డగా సీఎం కేసీఆర్ ఇది పద్ధతి కాదని మాట్లాడారు.
దాని గురించి మాట్లాడే సోయిలేని లంగవు నువ్వు. పనికిమాలిని స్వార్థం కోసం బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు చేసే రేవంత్ రెడ్డి నువ్వు కేసీఆర్ను పట్టుకొని అవమానంగా మాట్లాడుతున్నావు.
ఇష్టానుసారంగా మాట్లాడితే ఎవ్వరూ చూస్తూ ఊరుకోరన్నారు. నువ్వు చంద్రబాబు తొత్తువని అందరికి తెలుసు. మీ పార్టీ వారే నిన్ను పీసీసీ అధ్యక్షుడి గా అంగీకరించే పరిస్థితి లేదు నువ్వు మాట్లాడుతావా అని నిప్పులు చెరిగారు.