సంతోష్‌బాబు కుటుంబానికి ప్రభుత్వం పూర్తి అండ : మంత్రి కేటీఆర్

సూర్యాపేట : అమరవీరుడు, కర్నల్ సంతోష్‌బాబు కుటుంబానికి ప్రభుత్వం పూర్తిస్థాయిలో అండగా ఉంటుందని రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. భారత్-చైనా సరిహద్దులో విధులు నిర్వర్తిస్తూ భారతావని కోసం వీరోచితంగా పోరాడి అమరుడైన కర్నల్ సంతోష్ బాబు తొమ్మిది అడుగుల కాంస్య విగ్రహాన్ని మంత్రి కేటీఆర్ మంగళవారం సూర్యాపేటలో కోర్టు చౌరస్తాలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కోర్టు చౌరస్తాకు కల్నల్ సంతోష్‌బాబు చౌరస్తాగా మంత్రి నామకరణం చేశారు. అనంతరం జరిగిన విగ్రహావిష్కరణ సభలో మంత్రి పాల్గొని మాట్లాడారు.
కర్నల్ సంతోష్‌బాబు త్యాగాన్ని దేశం ఎన్నటికీ మరవదన్నారు. సంతోష్‌బాబు అమరుడై అప్పుడే ఏడాది గడిచిదంటే నమ్మలేకపోతున్నామన్నారు. ఎంతకాలం జీవించామన్నది కాదు.. ప్రజలు గుర్తుంచుకునేలా జీవించాలన్నారు. సీఎం కేసీఆర్ కల్నల్ సంతోష్‌బాబు కుటుంబానికి ఇచ్చిన గౌరవం, సముచిత స్థానం భారత సైన్యం మొత్తానికి ధైర్యాన్నిచ్చిందన్నారు. సంతోష్‌బాబు కుటుంబానికి సీఎం పెద్దఎత్తున సాయం చేశారనే ఆరోపణలు వచ్చాయి. కానీ సైన్యంలో ప్రతి కుటుంబానికి అండగా నిలిచేలా సీఎం నిర్ణయం ఉందన్నారు.
సూర్యాపేట ప్రజలకు స్ఫూర్తినిచ్చేలా సంతోష్‌బాబు విగ్రహాన్ని ఆవిష్కరించుకున్నామన్నారు. ప్రతీ ఒక్కరిలో స్ఫూర్తి నింపేలా సంతోష్‌బాబు విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అత్యత్భుతం అని తెలిపారు. కల్నల్ సంతోష్‌బాబు విగ్రహ శిల్పి శ్రీనివాస్‌రెడ్డికి మంత్రి ఈ సందర్భంగా అభినందనలు తెలిపి, శాలువాతో సత్కరించారు.
Read Today's Latest Suryapet News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

