చివ్వేంల, మర్చి 27: పెండింగులో ఉన్న బిల్లులు చెల్లించకుండా సర్పంచుల ముందస్తు అరెస్టులు ఇంకెన్నాళ్లని మాజీ సర్పంచుల ఫోరమ్ చివ్వేంల (Chivvemla) మండల అధ్యక్షుడు జులకంటి సుధాకర్ రెడ్డి అన్నారు. గురువారం మండలకేంద్రంతో పాటు, రాజు తండా, మొగ్గయ్య గూడెంలో అసెంబ్లీ ముట్టడికి బయలుదేరిన సర్పంచులను ముందస్తుగా అరెస్టు చేసి చివ్వేంల పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేసీఆర్ పాలనలో మాజీ మంత్రి జగదీశ్ రెడ్డ్ నాయకత్వంలో గ్రామాల అభివృద్ధికి ఎంతో కృషి చేశామన్నారు. అప్పులు చేసి ప్రజల సమస్యలను తీర్చేందుకు నిత్యం శ్రమించామని తెలిపారు. అలాంటి తమను ముందస్తు అరెస్టులు చేసి ఎన్నాళ్లు అడ్డుకుంటారని ప్రశ్నించారు.