తిరుమలగిరి: మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో పనిచేస్తున్న హమాలీలు, స్వీపర్లు, దడ్వాయిలకు దసరా సం దర్భంగా మార్కెట్ ఆధ్వర్యంలో పంపిణీ చేసిన బట్టలను ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ వారికి అందజేశారు. ఈ సందర్భం గా 300 మంది హమాలీలు, 26 మంది స్వీపర్లు, 26 మంది దడ్వాయిలకు అందించారు. మార్కెట్ సిబ్బంది ప్రశాంత వాతావరణంలో దసరా వేడుకలు జరుపుకోవాలని ఆయన కోరారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ అందరికి సంక్షేమ పథకాలు అందజేస్తున్న ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ అని అన్నారు. రైతులకు ముఖ్యమంత్రి కేసీఆర్ అండగా నిలిచారని అన్నారు. గతంలో వ్యవసాయం దండగా అన్న చోటే నేడు పండుగలా మార్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కిందన్నారు. కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ అశోక్‌రెడ్డి, ఎంపీపీ స్నేహలత, మున్సిపల్ చైర్పర్సన్ రజనీ, పీఏసీఎస్ చైర్మన్ పాలేపు చంద్రశేఖర్, మార్కెట్ వైస్ చైర్మన్ అంబయ్య, మార్కెట్ డైరెక్టర్లు ,సిబ్బంది పాల్గొన్నారు.